Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోనే అత్యంత వేగగామి ట్రైన్ గా పేరుగాంచిన వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుపై ఏపీలో రాళ్ల దాడి జరిగింది. నిన్న గూడూరు సమీపంలో ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు వేగంగా వెళుతున్న రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రైలు బోగీ అద్దం పగిలినట్టు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు కూడా పలుమార్లు రాళ్ల దాడికి గురైన సంగతి తెలిసిందే.