Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సతీమణి సైరా భాను తనకు తమిళం సరిగ్గా రాదని చెప్పడంపై నటి కస్తూరి కామెంట్ చేసింది. దీనికి ఏఆర్ రెహ్మన్ ప్రతిస్పందించాడు. ఇటీవల చెన్నైలో వికటన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు రెహ్మాన్ దంపతులు. ఈ సందర్భంగా హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని కోరాడు. అయితే తనకు తమిళం సరిగ్గా రాదని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైరాకు తమిళం రాకపోవడంపై నటి కస్తూరి శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. రెహ్మాన్ భార్యకు తమిళం రాదా.. ఆమె మాతృభాష ఏమిటి.. వాళ్లు ఇంట్లో ఏ భాషలో మాట్లాడుకుంటారని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన రెహ్మాన్ నా ప్రేమను నేను గౌరవిస్తానని తన భార్యను ఉద్దేశించి సమాధానం ఇచ్చాడు. ఈ మేరకు తమిళంలో స్పందించాడు.