Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో తేనీటి విందును ఇచ్చారు. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీ కాంత్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీకి వచ్చిన ఆయన తేనీటి విందులో పాల్గొన్నారు. రజనీకాంత్ రాకకు ముందే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన దక్షిణాది సూపర్ స్టార్ కు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. ఈ తేనీటి విందులో రజనీకాంత్, చంద్రబాబు, నటుడు బాలకృష్ణ, టీడీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చారు రజనీకాంత్. ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సూపర్ స్టార్ కు బాలకృష్ణ స్వాగతం పలికారు.