Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16లో భాగంగా 38వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. మొహాలీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. గత మ్యాచ్‌లో లక్నో ఆఖరి ఓవర్లో గుజరాత్ టైటన్స్ చేతిలో కంగుతిన్నది. పంజాబ్ కింగ్స్ బలమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఇరుజట్లు నాలుగు విజయాలు సాధించాయి. లక్నో ఆటగాళ్లు కేల్ మేయర్స్, నికోలస్ పూరన్, స్టోయినిస్ నిలకడగా రాణిస్తున్నారు. ఇక పంజాబ్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, సామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దాంతో, ఈమ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడలి. కాగా కొదిసేపటి క్రీతం టాస్ వేయగా పంజాబ్ టాస్ గెలిచింది. దీంతో కెఫ్టెన్ శిఖర్ దావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో బ్యాటింగ్ కు దిగనుంది.