Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ఛైర్మన్గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎల్ఐసీ ఛైర్మన్గా వ్యవహరించిన ఎంఆర్ కుమార్ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో పూర్తయిన నేపథ్యంలో మొహంతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మొహంతి ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా, యాక్టింగ్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే, ఎల్ఐసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ పట్నాయక్ను ఐఆర్డీఏఐ (లైఫ్) మెంబర్గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో డైరెక్టర్ల నియామకాల బాధ్యత చూసే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఖీూ×దీ) మొహంతీ పేరును గత నెల కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నియామకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఎల్ఐసీ ఛైర్మన్ పదవీ కాలాన్ని 62 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్రం 2021లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (స్టాఫ్) రెగ్యులేషన్స్, 1960 చట్టానికి సవరణలు చేసింది. దీంతో మొహంతి 62 ఏళ్ల వయసు వరకు అంటే 2025 జూన్ 7 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు బీసీ పట్నాయక్ సైతం 62 ఏళ్ల వయసు వరకు కొనసాగనున్నారు.