Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో లైబ్రేరియన్ నియామక పరీక్ష షెడ్యూల్ ప్రకారం మే 17న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ నుంచి పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ కమిషనరేట్లో 40, సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అయితే, ప్రశ్నప్రతాల లీకేజీ వ్యవహరంతో ఈ పరీక్షనూ వాయిదా వేస్తారనే అపోహలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా టీఎస్పీఎస్సీ స్పష్టతనిచ్చింది.