Authorization
Wed March 05, 2025 02:05:29 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని కాకినాడ తీరంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం కోరంగిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైబర్ బోట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. దీంతో 40 బోట్లకు పైగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలసుకుని హుటాహుటిన ఫైర్ సర్వీస్ అధికారులు తరలివచ్చారు. సిబ్బంది స్థానికులతో కలిసి మంటలు ఆర్పేస్తున్నారు