Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం 15ఏళ్ల బాలికపై పట్టపగలే నడివీధిలో లైంగికదాడియత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. బాధిత బాలిక దుకాణానికి వెళ్లి తిరిగొస్తుండగా యువకుడు కె.రమేశ్ ద్విచక్రవాహనంతో అడ్డగించాడు. ఆ బాలిక శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు బలవంతంగా తన వాహనంపైకి ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు తప్పించుకుని తన ఇంటికి పరుగు తీసింది. తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు నిందితుడిని నిలదీశారు. దీంతో వారిపైనా నిందితుడు దాడి చేశాడు. పోలీసులకు సమచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.