Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించనుంది. తన లివింగ్ భాగస్వామి అయిన శ్రద్ధావాకర్ ను ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా గొంతు కోసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి చంపాడు.ఈ కేసులో ఢిల్లీ పోలీసులు జనవరి 24న 6,629 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.సంప్రదాయం, సంస్కృతికి అనుగుణంగా తన కూతురు మృతదేహాన్ని తమకు అంత్యక్రియల కోసం అప్పగించాలని కోరుతూ వాకర్ తండ్రి కోర్టుకు సమర్పించిన దరఖాస్తుపై ఢిల్లీ పోలీసులు రేపు సమాధానాన్ని దాఖలు చేయనున్నారు. ఈ కేసులో డీఎన్ఏ పరీక్షలు, 55 మంది సాక్షులు, సెల్ ఫోన్ ఛాటింగులను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి మనీషా ఖురానా కక్కర్ ప్రాసిక్యూషన్ లాయర్లతో పాటు నిందితుల నుంచి అభియోగాల రూపకల్పనపై వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 15వతేదీన ఉత్తర్వులను రిజర్వ్ చేశారు.పూనావాలాపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 302,201 కింద కేసు నమోదు చేశారు.