Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ జారి.. ప్లాట్‌ఫాం, రైలు బోగీ మధ్య సందులో ఇరుక్కుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి గూడూరు వరకు ప్రయాణించే 17260 మెమో ఎక్స్‌ప్రెస్ ఉదయం 8 గంటలకు చీరాల స్టేషన్‌కు వచ్చింది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరెడు గ్రామానికి చెందిన కట్టా తిరుపతమ్మ స్టేషన్లో దిగి..పని చేసుకొని రైలు కదిలేటప్పుడు ఎక్కబోయారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి ప్లాట్‌ఫాం-రైలు బచిగీ మధ్య చిక్కుకుపోయారు. గమనించిన ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుళ్లు డి.కోటేశ్వరరావు, నాగార్జున విజిల్స్ వేస్తూ రైలును ఆపివేశారు. తోటి ప్రయాణికులు, స్థానికుల సాయంతో ప్లాట్‌ఫాంను పగులకొట్టి తిరుపతమ్మను అతికష్టం మీద బయటకు తీశారు. పొట్ట, నడుమ వద్ద తీవ్ర గాయాలైన ఆమెను చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు ఒంగోలు తీసుకెళ్లారు.