Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలో నూతన సచివాలయం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాగా.. ఈ ఆంక్షలవల్ల ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను దారిమళ్లించారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే చింతల్‌బస్తీ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వైపు అనుమతి నిరాకరించారు. అలాగూ.. ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలకు తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లించారు. అలాగే.. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇచ్చారు. అలాగే ఎల్లుండి ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.