Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో 'బిచ్చగాడు' ఒకటి. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ సినిమాకు పోస్టర్లు కూడా ఎక్కువగా అతికించలేదు. కేవలం గోడలపై బిచ్చగాడు సినిమా విడుదల అంటూ రాసారు. అలా లో ప్రమోషన్లతో ఈ సినిమా విడుదలైంది. తొలిరెండు రోజులు థియేటర్లలో జనాలే లేరు. కానీ ఆ తర్వాత మౌత్ టాక్‌తో జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. రూ.2.2 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా తెలుగులో రూ. 14కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అందరి కళ్లు బిచ్చగాడు-2 పైనే ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 19న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.