Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: రవీంద్రన్ బైజూ, ఆయన కంపెనీపై ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సోదాలు చేస్తోంది. ఫెమా చట్టం కింద బెంగుళూరులోని మూడు ప్రదేశాల్లో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఆన్లైన్లో బైజూస్(Byju’s) పేరుతో విద్యను బోధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈడీ దాడుల సమయంలో విస్తుపోయే డాక్యుమెంట్లను, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. బైజూస్ కంపెనీకి సుమారు 28 వేల కోట్ల విదేశీ పెట్టుబడి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2011 నుంచి 2023 మధ్య కాలంలో ఆ మొత్తం జమా అయినట్లు ఫెమా సోదాల్లో తేలింది. ఇదే కాలంలో కొన్ని విదేశీ కంపెనీలకు సుమారు 9754 కోట్లు రెమిట్ చేసినట్లు కూడా బైజూస్‌పై ఆరోపణలు ఉన్నాయి.