Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌పై తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. టీటీడీ వెబ్ సైట్లో దర్శనం, గదులు బుక్ చేసుకున్న భక్తులకు షాక్ తగులుతోందన్నారు. దర్శన టికెట్లకు తీసుకోవాల్సిన డబ్బులకంటే టీటీడీ అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. టీటీడీ జీఎస్టీ పరిధిలో ఉందా? లేక.. జగన్ ట్యాక్స్ పరిధిలో ఉందా? అని ప్రశ్నించారు. టీటీడీ వెబ్ సైట్‌ను వెంటనే క్లోజ్ చేసి కొత్త వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా టీటీడీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. భక్తుల నుంచి అధిక వసూళ్లపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపై అనుమానం ఉందని అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దీనిపై ఏం సమాధానం చెబుతారని అడిగారు. టీటీడీ కేసులు పెట్టడం, మంత్రులతో సిఫార్సులు చేయించుకోవడం మానుకుని భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ హితవుపలికారు.