Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: 2020లో చోటు చేసుకున్న గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో నాయక్ దీపక్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాయక్ దీపక్ భార్య తన భర్తను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరింది. భార్య రేఖా సింగ్.. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియామకం అయినట్లు భారత ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. లఢక్‌లోని ఎల్ఏసీ వద్ద రేఖా సింగ్ విధులు నిర్వర్తించనుంది.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో రేఖా సింగ్ ఏడాది పాటు శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణ నేటితో ముగిసిందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేఖా సింగ్‌కు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ రెజిమెంట్‌కు చెందిన 16వ బెటాలియన్‌లో పని చేస్తున్న నాయక్ సింగ్‌కు మరణానంతరం వీర్ చక్ర అవార్డును కేంద్రం 2021లో ప్రకటించిన సంగతి తెలిసిందే.