Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తర ప్రదేశ్ : గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారం తీర్పు చెప్పింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ని అపహరించి, హత్య చేసినట్లు రుజువుకావడంతో ఆయనకు ఈ శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. కిడ్నాపింగ్, హత్య కేసుల్లో ముక్తార్ అన్సారీతోపాటు ఆయన సోదరుడు, బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా దోషులని కోర్టు తీర్పు చెప్పింది.