Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లకు సంబంధించిన అంబులెన్స్.. కేరి సెక్టార్ వద్ద రోడ్డుప్రమాదానికి గురైంది. అతి వేగంతో దూసుకొచ్చిన అంబులెన్స్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. సిక్కింలో గతేడాది డిసెంబర్లో ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.