Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కొత్త సచివాలయంపై బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లనని బండి సంజయ్ ప్రకటించారు. ఎంపీ ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసం, ఓ సామాజిక వర్గాన్ని సంతృప్తి పర్చడానికే సచివాలయం కట్టినట్లు ఉందన్నారు. నల్లపోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలు, మసీదుకు 5 గుంటలు ఇస్తారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో హిందువులు బాంచన్ దొర బతుకు బతకాలా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్కృతికి.. అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తామని, ఆ తర్వాతే కొత్త సచివాలయంలోకి అడుగుపెడతామని బండి సంజయ్ ప్రకటించారు. సొంత ముద్ర కోసమే కేసీఆర్ సచివాలయం నిర్మించారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు తప్పుబట్టారు. కొత్త సచివాలయం వచ్చినా ప్రజా సమస్యలు.. పరిష్కారం అవుతాయని అనుకోవడం లేదన్నారు. కొత్త సచివాలయం సీఎం, మంత్రుల కోసమేనా? అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే సామాన్యులకు అవకాశమే లేదా? అని నిలదీశారు. సచివాలయం, భారీ అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, నిర్మించినంత మాత్రాన అన్నీ చేసినట్లు కాదని, కేసీఆర్ అలా భావిస్తే పొరపాటేనని విమర్శించారు. కేసీఆర్ గడికి భారీ పోలీస్ భద్రత ఎందుకు?.. ప్రజలు రావడానికి అనుమతులు తీసుకోవాలా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.