Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకం మే 6న అట్టహాసంగా జరగనుంది. దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు అతిథులుగా రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మన దేశం నుంచి కూడా ఓ సెలబ్రిటీకి అవకాశం దక్కింది. పట్టాభిషేకం తర్వాతి రోజున నిర్వహించేే కార్యక్రమంలో హాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఛార్లెస్ పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ ఆహ్వానం నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని ఆనందం వ్యక్తం చేసింది. వివాహం అనంతరం సోనమ్ తన కుటుంబంతో కలిసి లండన్లోనే ఉంటోంది. ఇటీవల భారత్కు వచ్చిన ఆమె.. ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ను యాపిల్ సీఈవో టిమ్కుక్తో కలిసి వీక్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక బ్రిటన్ రాజు పట్టాభిషేక వేడుకలు మే 6 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రిటన్ రాజ కుటుంబ వేడుకలకు సోనమ్ హాజరు కానుండటం ఇదే తొలిసారి.