Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఐదుగురి నుంచి ఐదు ఫోన్లతో పాటు కారును సీజ్ చేశారు. అరెస్టు అయిన వ్యక్తులను ఏపీకి చెందిన జెమ్మిలి బండు, కాపు చందర్ రావు, ఈ సంతోష్ రెడ్డి(కర్మన్‌ఘాట్), ఎన్. సాయి భరత్(అంబర్ పేట్), వీ హరితేజ(సరూర్ నగర్)గా పోలీసులు గుర్తించారు. బండు, చందర్ రావు కలిసి నిన్న రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. సంతోష్, భరత్, హరితేజకు 2.5 లీటర్ల హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 2.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను రూ. 80 వేలకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. 5 మి.లీ. సామర్థ్యం కలిగిన బాటిల్స్‌లో హాష్ ఆయిల్‌ను నింపి విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న వారిలో మెడికల్, ఐటీ ఉద్యోగులతో పాటు స్టూడెంట్స్, నిరుద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.