Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని నీలకంఠ పర్వాతాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంచుజారిపడింది. ఇటీవల భారీగా మంచువర్షం కురుస్తుండడంతో కొండలన్నీ మంచుతో పరుచుకున్నాయి. ఈ క్రమంలో రిషిగంగ వద్ద కొండలపై నుంచి ఉన్నట్టుండి మంచు జారిపడింది. మరో వైపు యమునోత్రి ధామ్ సహా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. యమునోత్రి ధామ్ సందర్శించి.. గంగోత్రికి వెళ్తున్న సమయంలో బండరాయి తగిలి తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబీకులు బార్కోట్ సీహెచ్‌సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
మృతురాలిని ఏపీకి చెందిన సరోజ (46)గా గుర్తించారు. ఆమె హైదరాబాద్‌లోని అల్కాపురిలో నివాసం ఉంటున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. మృతులు బంధువులతో కలిసి శుక్రవారం యమునోత్రిలో దర్శనం చేసుకున్నారు. ఖరాడి పట్టణంలో ఓ హోటల్లో బస చేసి శనివారం ఉదయం గంగోత్రికి ఓ
వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో కొండ వద్ద నుంచి వెళ్తుండగా.. బండరాయి వచ్చి తలపై పడింది. దాంతో కుటుంబీకులు వెంటనే సరోజను బార్కోట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు నవోగావ్ను పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతురాలిని ఏపీకి చెందిన సరోజ (46)గా గుర్తించారు. ఆమె హైదరాబాద్‌లోని అల్కాపురిలో నివాసం ఉంటున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. మృతులు బంధువులతో కలిసి శుక్రవారం యమునోత్రిలో దర్శనం చేసుకున్నారు.