Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజమండ్రి: మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు. 27న 15 వేల మందితో ప్రతినిధుల సభ, 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి మహానాడుకు 2 చోట్ల వేదికలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహానాడు నిర్వాహణ కోసం 15 కమిటీలు నియమించామని, రెండు రోజుల్లో కమిటీలను ప్రకటిస్తామని వెల్లడించారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు.. 15 లక్షల మంది హాజరవుతారని అచ్చెన్నాయుడు చెప్పారు. టీడీపీ మహానాడును రాజమండ్రిలో మే నెల 27, 28వ తేదీల్లో నిర్వహించడానికి పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఎన్నికలు ఏడాది కాలంలో రానున్న నేపథ్యంలో ఇక్కడ మహానాడు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.