Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: అనుష్క, నవీన్ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ - ప్రమోద్ నిర్మాతలు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో నవీన్ పొలిశెట్టి... సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ పాత్రలోనూ, కథానాయిక అనుష్క... అన్విత రవళిశెట్టి అనే షెఫ్ పాత్రలోనూ నటించారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు.