Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(67), హెన్రిచ్ క్లాసెన్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగారు. దాంతో, మరక్రం సేన 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు కొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మయాంక్ అగర్వాల్(5) తక్కవకే ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి(10), హ్యారీ బ్రూక్(0) మరోసారి విఫలయ్యారు.
ఒక దశలో హైదరాబాద్ 150 రన్స్ చేయడమే కష్టం అనిపించింది. కానీ, అభిషేక్, అబ్దుల్ సమద్(28), క్లాసెన్ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన అకీల్ హొసేన్(16 నాటౌట్) రాణించాడు. మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ , ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.