Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వామివారి ధర్మదర్శనాలకు 2గంటలు, ప్రత్యేక దర్శనాలకు అరగంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 25వేలకు పైగా భక్తులు ఇష్టదైవాలను దర్శించుకున్నారు. ప్రధానాలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రాకార మండపంలో వేదాశీర్వచనంతో పాటు పలు ఆర్జిత సేవోత్సవాల్లో భక్తజనులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. ఉదయం ఎడతెరిపి లేకుండా సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో ఇష్టదైవాల దర్శనాల కోసం వచ్చిన భక్తులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు. వర్షంలోనే దేవదేవుడిని దర్శించుకునేందుకు తరలివెళ్లారు. యాదగిరీశుడికి శనివారం నిత్య పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో ఆరంభమైన నిత్య పూజలు రాత్రి వేళ శయనోత్సవ పర్వాలతో ముగిశాయి. వర్షం కారణంగా ఆలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. స్వామి వారి ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.23,49,242ల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.