Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్నారు. హైదరాబాద్లో లక్ష మం ది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం గా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి మంత్రి కేటీఆర్ ఆదివారం అడుగు పెట్టనున్నారు. మూడో అంతస్తులోని తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలకమైన ఫైలుపై తొలి సంతకం చేయనున్నారు.