Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ తన ప్లాట్ ఫామ్‌పై ‘గ్రేట్ సమ్మర్ సేల్’ ఆఫర్లు ప్రకటించింది. గురువారం (మే 4) నుంచి గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు మొదలు లాప్‌టాప్‌లు, హోం అప్లియెన్సెస్, ఇతర వస్తువులపై పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందుగానే సమ్మర్ సేల్ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ సేవింగ్స్ అందిస్తున్నది. అయితే గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్ల పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ ఫోన్ డిస్కౌంట్ ధరపై రూ.18,499, వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఫోన్ రూ.34,999లకే సొంతం చేసుకోవచ్చు. రెడ్ మీ 12 సీ ఫోన్ రూ.8,999లకే లభిస్తుంది. ఇక వన్ ప్లస్ బుల్లెట్స్ జడ్2 రూ.1599లకే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ ఫోన్ రూ.24,999 పలుకుతుండగా, రూ.14,999లకే లభిస్తుంది. మరో గెలాక్సీ ఎం4 ఫోన్ రూ.6,999లకే సొంతం చేసుకోవచ్చు.
టీవీ, ఇతర హోం అప్లయెన్సెస్ కొనుగోళ్లపై 60 శాతం వరకు డిస్కౌంట్లు పొందొచ్చు. వన్ ప్లస్ వై సిరీస్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ ఆండ్రాయిడ్ టీవీ రూ.14,99, ఎల్జీ 190 లీటర్ల సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.17,490, ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యుయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ.46,490లకు సొంతం చేసుకోవచ్చు. ఈ సమ్మర్ సేల్‌లో వివిధ వస్తువుల కొనుగోళ్లపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. జెబ్రోనిక్స్ హేజ్ వైర్ లెస్ మౌజ్ రూ.249, ఫైర్-బోల్లా నింజా సాల్ల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ రూ.1699, బోట్ రాకర్జ్ 255 ప్రో నెక్ బాండ్ రూ.3999లకే సొంతం అవుతాయి.