Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం దవాఖానకు తరలించారు. బస్సు భద్రచాలం నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.