Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వద్ద సందడి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి.