Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్లోని కొన్ని మ్యాచ్లకు ముంబయి సారథి రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాని, అప్పుడే ఉత్సాహంగా ఉంటాడని టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఈ ఐపీఎల్ టోర్నీ ముగిశాక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ తగినంత విశ్రాంతి తీసుకోవాని సన్నీ సూచించాడు. రోహిత్ విషయంలో గావస్కర్ చేసిన సూచనలపై ముంబయి ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు. ‘‘రోహిత్ విశ్రాంతి తీసుకుంటాడని అనుకోవడం లేదు. అది నాకు సంబంధించిన విషయం కూడా కాదు. అయితే, మేం మాత్రం రోహిత్ ఆడాలని కోరుకుంటాం. టాప్ ప్లేయర్ మాత్రమే కాకుండా మా జట్టు కెప్టెన్. ఒకవేళ రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని భావించి..ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిశీలిస్తాం. తగిన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు రోహిత్ అలా చేయలేదు. కాబట్టి, తప్పకుండా మిగతా మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండి ఆడతాడని భావిస్తున్నాం’’ అని బౌచర్ తెలిపాడు.