Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు. ఉదయం 5.50 గంటలకే రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం 6.15 గంటలకు సచివాలయానికి చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడే జరిగే వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటున్నారు.