Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తొలుత ప్రధాన ప్రవేశ గేటు వద్ద పూజలు నిర్వహించిన ఆయన.. తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబరుకు చేరుకొని పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు పెద్ద సంఖ్యలో వేదపండితులు హాజరయ్యారు. ప్రధాన గేటు వద్ద ముఖ్యమంత్రిని వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతించి ఆశీర్వచనాలు పలికారు. సభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.