Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కీలక దస్త్రంపై కేసీఆర్ సంతకం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ మొదటి సంతకం చేసి, ఆ ఉద్యోగుల్లో సంతోషం నింపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.