Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతపురం : తాడిపత్రిలో మరోసారి ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా ప్రధాన కూడళ్ళలో ఫ్లెక్సీలు వెలిశాయి. డీజిల్ దొంగ ఎవరంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఫ్లెక్సీలో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోటోపై ముద్దుల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. డీజిల్ దొంగ ఎవరో తేల్చాలన్నారు. ‘ ప్రజల గుండె దోచుకునే గజదొంగ నేను.. ప్రజల సొమ్ము దోచుకునే గజదొంగ నువ్వు’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన గుండె తాడిపత్రి అంటోందంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి షర్టు చూపించారు. ఫ్లెక్సీలు తాను కడతానని... గజదొంగ ఎవరో తేల్చాలంటూ కేతిరెడ్డికి సవాల్ విసిరారు. ఇంకా సంవత్సరం మాత్రమే టైం ఉందని ఏం తింటావో తినమంటూ హెచ్చరించారు. పుట్లూరు యల్లనూరు మండలంలో దొంగతనం చేసుకునే వాడివని.. దొంగతనాలు చేసుకోమని తెలిపారు.