Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. విజయవాడ నగరంలో గంట నుంచి కుండా పోత వర్షం పడుతోంది. వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు రోడ్లపై వర్షపు నీరు పొంగిపొరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతర్యం ఏర్పడింది. అలాగూ మామిడి, వరికి, మిర్చి పంటకు అపారమైన నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. అలాగే ఏలూరు జిల్లాలో కాకుండా నూజివీడు ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మామిడి రైతులు ఆందోళనలో వున్నారు. అధికారులు తగిన ఆర్థిక సాయం అందించాలని పంట నష్టపోయిన రైతులు వాపోతున్నారు.