Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగ మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలి శెట్టి శివయ్య, హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంక చందు, అక్కన్న పేట మండల అధ్యక్షులు జంగపల్లి అయిలయ్య, సంజీవ రెడ్డి, బద్దం రాజి రెడ్డి ,కౌన్సిలర్లు భూక్యా సరోజన, పున్న లావణ్య, సది, చిత్తారి పద్మ, వల్లపు రాజు, మ్యాదర బోయిన శ్రీనివాస్, ముకుంద రెడ్డి, గులాబీల లింగా రెడ్డి, బొంగోని శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి లు మ్యాక రమేష్, భాస్కర్ నాయక్, అడ్వకేట్ చిత్తారి రవి, గుర్రాల లింగా రెడ్డి, కేతిరి లక్ష్మా రెడ్డి, వెన్న రాజు, మైదం శెట్టి వీరన్న, ఎస్టీ సెల్ భీక్య నాయక్, కిసాన్ సెల్ శ్రీకాంత్ రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బూరుగు కిష్ట స్వామి, బండి కుమార్ గౌడ్, వర ప్రసాద్, దేవయ్య, తనుకు ఆంజ నేయులు, లావుడ్య జవహర్, బోనగిరి రజిత, స్వరూప, కమల తదితరులు పాల్గొన్నారు.