Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్- పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో సీఎస్కే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగా ఓపెనర్లు దూకుడైన ఆరంభాన్నిచ్చారు. డెవాన్ కాన్వే (92) అద్బుత ఇన్నింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరగులు చేసింది. మరో ఓపెనర్ గైక్వాడ్ (37) మోయిన్ ఆలీ (28) పరుగులు చేయగా చివర్లో వచ్చిన ధోని (13) రెండు సిక్స్ లు బాదీ 200 పరగులకు తీసుకవచ్చాడు. దీంతో పంజాబ్ కు 201 పరగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, సమ్ కర్రన్, రాహుల్ చాహర్, రజా తలో వికెట్ తీసుకున్నారు.