Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర రాజధాని ముంబై మన్ ఖుర్ద్ లో శనివారం సాయంత్రం ఓ మహిళను ఆమె పొరుగువారే కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందిరా నగర్ ప్రాంతంలో మహిళకు, ఆమె పొరుగింటి వారికి ఏదో అంశంపై గొడవ జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో సదరు మహిళను కాల్చి చంపారు. గొడవకు దిగిన పక్కింటి మహిళ భర్త, ఆమె కొడుకు సంఘటన స్థలానికి చేరుకొని ఒక రౌండ్ కాల్పులు జరిపారని, బాధితురాలి ఛాతికి గాయమైందని తెలిపారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, అక్కడకు వెళ్లేలోపు మరణించినట్లు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే లోపు ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమెను కాల్చిన తర్వాత నిందితుడు, అతని కుమారుడు అక్కడి నుండి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, తన కూతురుపై లైంగికదాడి చేశాడని ఆరోపిస్తూ మృతురాలు ఇటీవల నిందితుడి సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.