Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని మోడీ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యంగాస్త్రాలు సంధించింది. ఈ ఎపిసోడ్ ప్రసారం కావడానికి కొంత సమయం ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. 'మన్ కీ బాత్' వందో ఎపిసోడ్ దేశంలోని అనేక సమస్యలపై ప్రధాని మోడీ నిర్వహిస్తున్న 'మౌన్ కీ బాత్' అంటూ ఎద్దేవా చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంపై ఐఐఎమ్ రోహ్తక్కు చెందిన పరిశోధన విభాగం విద్యార్థి అధ్యయనం చేపట్టగా.. ఆ సంస్థ డైరెక్టర్ విద్యార్హతలను కేంద్ర విద్యాశాఖ ప్రశ్నించిందని విమర్శించారు. ఈ రోజు నకిలీ మాస్టర్ ప్రత్యేకం. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కానీ, ఇది చైనాతో సరిహద్దు గొడవలు, అదానీ కంపెనీ వ్యవహారం, ఆర్థిక అసమానతల పెరుగుదల, నిత్యావసరాల ధరల పెరుగుదల, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు, మహిళా రెజ్లర్లకు జరిగిన అవమానం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేసిన అవినీతి, ఆర్థిక నేరగాళ్లతో బీజేపీ స్నేహ సంబంధాలు వంటి దేశంలోని అనేక సమస్యలపై నిర్వహిస్తున్న మౌన్ కీ బాత్ అని జైరాం ట్వీట్ చేశారు.