Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేని భార్య భర్తను హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో చోటు చేసుకున్నది.
అలంపూర్ సీఐ సూర్యానాయక్ కథనం మేరకు.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెర్లపల్లికి చెందిన అలివేలు, ఇటిక్యాల మండలం మొగలిరావుల చెరువుకు చెందిన మంద దేవరాజ్‌తో 15 ఏండ్ల కిందట ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేవరాజ్ మద్యానికి బానిస కావడంతో వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఇద్దరు చీటికి.. మాటికీ గొడవలు పడేవారు. మద్యం మత్తులో తనను వేధింపులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన అలివేలు భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. దీంతో శనివారం మద్యం తాగి వచ్చి నిద్రిస్తున్న భర్తను ఆదివారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.