Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' రెండో భాగం తాజాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులోని పాత్రలు ప్రేక్షకుల మనసులు దోచాయి. అగ్ర తారల నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. అందుకే ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌పై నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
'పొన్నియిన్ సెల్వన్' సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లో ఏకంగా రూ.100కోట్లు (గ్రాస్) వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అందుకే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో సగానికి పైగా వసూళ్లు అక్కడి నుంచే వచ్చాయి. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రాల లిస్ట్‌లోనూ ఇది చేరిపోయింది. ఈ కలెక్షన్స్‌పై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అందులో పేర్కొంది. ఇక ఈ సినిమా మొదటి భాగం రూ.400 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత కలెక్షన్స్ చూస్తే రెండో భాగం కూడా ఆ మార్క్‌ను త్వరలోనే చేరుతుందని సినీ పండితులు చెబుతున్నారు.