Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బుల్లితెరపై వచ్చే ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నడుస్తున్న సీజన్లో చైతన్య మాస్టర్ బాగానే ఫేమస్ అయ్యాడు. అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలోనే చైతన్య మాస్టర్ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మరణ వార్త తెలిసి అభిమానులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు. నెల్లూరులో ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి క్లబ్ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం. ఆర్థికపరమైన సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు ముందు ఆయన ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేయడంతో అసలు విషయం అందరికీ తెలిసి వచ్చింది. తాను ఈ పని చేస్తున్నందుకు తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పుకొచ్చాడు. అప్పులు ఇచ్చినవాళ్లు ఇచ్చిన ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని.. చాలా ట్రై చేసినా అవ్వడం లేదని తన బాధనంతా వెల్లగక్కాడు. ఒక అప్పును పూడ్చుకునేందుకు.. మరో అప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని తన ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.