Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కొత్త సచివాలయ ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమమని, కానీ సీఎంవో ఎక్కడా నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవించేదన్నారు. కేసీఆర్ సొంత కార్యక్రమంలా ప్రారంభోత్సవం చేశారన్నారు. గవర్నర్ ను సైతం ఆహ్వానించలేదన్నారు. విపక్షాలను ఆహ్వానించడంలో ప్రోటోకాల్ పాటించలేదన్నారు. తెలంగాణ సచివాలయం, అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి జరిగిందని కూడా రేవంత్ విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరుపుతామన్నారు. దోషులను శిక్షిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడ్డ వారికి శిక్ష తప్పదన్నారు. సచివాలయ నిర్మాణం అంచనాలను పెంచారని ఆరోపించారు.