Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 7న హైదరాబాద్ లో నిర్వహించే భరోసా సభను జయప్రదం చేయాలని డి.ఎస్.పి పార్టీ మండల అధ్యక్షులు కోగిల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆదివారం మండల కేంద్రంలో బీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అజయ్ కుమార్ హాజరై పోస్టర్ ఆవిష్కరణ చేసి మాట్లాడారు.ఈ బహిరంగ సభ బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జి కుమారి మాయావతి హాజరవుతున్నారని అన్నారు. కావున బీసీ ఎస్సీ ఎస్టీ,మైనారిటీ,ప్రజాలైన శ్రామికులు, విద్యార్థులు, మేధావులు,యువత ఈ సభకు హాజరుకావాలని ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ రాజకీయ,ఆర్థిక దోపిడీకి,ప్రధాన సమస్య రాజకీయాలే,ఇంతటి ప్రాధన్యత ఉన్న రాజకీయాల్లో అన్ని వర్గాల ప్రజల ప్రాతినిధ్యం జనాభా దామాషా ప్రకారం అధికార విభజన జరగాలని భారతదేశంలో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. మన తెలంగాణ లో డాక్టర్ ప్రవీణ్ కుమార్ , ఆధ్వర్యంలో జరిగే ఈ ఆధిపత్య వర్గాల రాజకీయాలనుండి విముక్తి కొరకై ఓటు చైతన్యం ఓటు ప్రాధన్యత తెలుసుకోడానికి అయిన ప్రజలు తప్పక ఈ సభకు,తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోశాధికారి ,చిన్ని,పసర సెక్టార్ అధ్యక్షులు సంగి శివ,సంగి సందీప్ గ్రామ నాయకులు మాల్యాల ప్రకాష్,కళ్లెపెళ్లి భిక్షపతి,బిజిగం శ్రీహరి కొత్తపల్లి గుణశేఖర్ మాదాసు రాజు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.