Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కరెంట్ షాక్‌తో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ఒకరు మృతి చెందారు. గండిపేట గ్రే హౌండ్స్‌లో పనిచేసే వీరాస్వామి(45) ఫ్యామిలీతో కలిసి అక్కడి క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. వీరా స్వామి తమ్ముడు యూసఫ్‌గూడ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తమ్ముడిని కలిసేందుకు యూసుఫ్‌గూడకు వచ్చిన వీరాస్వామి తిరిగి రాత్రి బైక్‌పై గండిపేటకు బయలుదేరాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ఫ్రీ లెఫ్ట్వద్దకు రాగానే ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. అతడి బైక్ అదుపు తప్పడంతో ఫుట్‌పాత్‌పై పడిపోయి.. పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని తాకాడు. కరెంట్ షాక్ తగలడంతో పోలీసులు వెంటనే అతడిని అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలోకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.