Authorization
Wed March 05, 2025 01:01:04 am
నవతెలంగాణ - ఢిల్లీ: వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను ₹171.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹1856.50కు తగ్గింది. తగ్గించిన ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.