Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్.. తన కస్టమర్ల కోసం మరోమారు బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ తీసుకు వచ్చింది. మే నెల ఐదో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 10 వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ లో ఐ-ఫోన్ 13పై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ, రియల్ మీ సీ55, గూగుల్ పిక్సెల్ 6ఏ ఇతర ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది.
ఆపిల్ ఐ-ఫోన్ 13పై ఎంత డిస్కౌంట్ ఇస్తామన్న సంగతి వెల్లడించలేదు గానీ గణనీయంగా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫ్లిప్ కార్ట్ ‘కర్టైన్ రేజర్ డీల్స్` మే ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు సాగుతుంది. ప్రస్తుతం ఐ-ఫోన్ 13 ధర రూ.61,999 కాగా, దానిపై 11 శాతం డిస్కౌంట్ అంటే రూ.7901 పొదుపు చేయొచ్చు. ఫ్లిప్ కార్ట్ రిటైల్ ప్రైస్ ప్రకారం రూ.69,900లకు లభిస్తుంది. ఓల్డ్ స్మార్ట్ ఫోన్ బాగా ఉన్నట్లయితే రూ.29,250 ధర తగ్గుతుంది. వివిధ బ్యాంకు కార్డులపై కొనుగోళ్లు చేసిన వారికి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం, హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.2000 చొప్పున క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.