Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి : తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
రేపు కోనసీమ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షం సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండరాదని విపత్తుల సంస్థ సూచించింది. రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.