Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మే 4న ఢిల్లీలో కొత్త బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్లనున్నారు. నేడు లేదా రేపు ఆయన ఢిల్లీకి పయనమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశరాజధానిలో బీఆర్ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.
మరోవైపు, సీఎం కేసీఆర్ కొత్త సచివాలంలో నేడు ఇరిగేషన్ శాఖపై తొలి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ కొడంగల్ వికారాబాద్‌కు వెళ్లే తాగునీటి కాలువలను సమీక్షిస్తారు. సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.