Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనకాపల్లి
తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సహాయకుడు (పీఏ)పై వైకాపా ఎమ్మెల్యే చేయిచేసుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ క్రమంలో సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీఐఐసీ పైపులైన్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార యువతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాగ్ నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలే నిలదీయడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారిపైకి కన్నబాబురాజు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పీఏ నవీన్వర్మ ఆయన చేయిపట్టుకుని వెనక్కిలాగారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే.. పీఏ చెంప చెళ్లుమనిపించారు. అనంతరం పోలీసుల జోక్యంతో సొంతపార్టీ నేతల నిరసనల మధ్యే కార్యక్రమం యథావిధిగా కొనసాగింది.